Bhadradri Balotsav (National level Children's festival) 2018

Bhadradri Balotsav (National level Children's festival): The prestigious children’s festival, Balotsav, an annual International Telugu Children’s festival, will be held on the Bhadrachalam Govt Junior College Sports Ground, during November 09-11, NRI Dr Thalluri Raja Krishna said on 23-10-2018. The applications for the participation in the event will be accepted till October 31. There is no entry fee for competition and accommodation would also be provided for the registered students as well as their in-charges from the schools.

balotsav (national level children's festival),balotsav event and activities,balotsav dates,balotsav online applications,last date to apply for balotsav

Event and activities
The festival is conducted in the second week of November, close to the Children's Day of India. Competitions are held in categories such as painting, elocution, poetry, essay writing, singing, dancing, classical performances, folk performances, crafts, monodrama and letter writing. Most of these competitions are held for the Telugu language, however a few of them such as the spelling bee and public speaking are conducted for the English language as well.

Balotsav (Children's festival)
Balotsav (Children's festival) is an annual international cultural festival for Telugu children. It includes competitions in various aspects such as painting, elocution and drama. It was started as a town-level event in 1991. Since then the event has gained popularity among the school children, and is now a national level event with thousands of participants from several states of India.

నవంబరు 9, 10, 11 తేదీల్లో భద్రాద్రి బాలోత్సవం: 
1. జాతీయ స్థాయి బాలల పండుగ భద్రాద్రి బాలోత్సవం నవంబరు 9 నుంచి 11 వరకు భద్రాచలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు ప్రవాస భారతీయుడు డా.తాళ్లూరి రాజా శ్రీకృష్ణ తెలిపారు.

2. అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాల్లో వేలాది మంది చిన్నారులు పాల్గొని తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారని వెల్లడించారు.

3. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా అక్టోబరు 31లోగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

4. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు భోజన, వసతి సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

5. a. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు సబ్‌ జూనియర్స్‌గా,
b. 5 నుంచి 7వ తరగతి వరకు జూనియర్స్‌గా,
c. 8 నుంచి 10వ తరగతి వరకు సీనియర్స్‌గా గుర్తించి బాలల సంబరాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

6. వ్యక్తిగతంగా, బృందంగా ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.




మన సంప్రదాయ సంస్కృతి సౌరభాలను గుబాళింపు చేస్తూ సంప్రదాయ కళల పట్ల బాల బాలికలకు అభిరుచి పెంపొందించడానికి భద్రాద్రి బాలోత్సవం-2018 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈసారి జాతీయస్థాయిలో బాలోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నామని వారు తెలిపారు.
బాల్య దశలో ఉండే ఆలోచనలు, వారిలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకత వెలికితీయడానికి, వారికి ప్రేరణ కల్పించడానికి భద్రాద్రి బాలోత్సవంనకు శ్రీకారం చుట్టామన్నారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో నవంబర్ 9, 10, 11 తేదీల్లో భద్రాద్రి బాలోత్సవం-2018 పేరిట జాతీయస్థాయి తెలుగు బాలల పండుగను కన్నులపండువగా నిర్వహిస్తామని తెలిపారు.

తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు, ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(తానా), ఐటీసీ పీఎస్‌పీడీ, భాషా సాంస్కృతిక శాఖ- తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మూడురోజుల పాటు భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు జరుగుతాయని వారు తెలిపారు.

కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని, ఈ మేరకు ఇప్పటికే 500 పాఠశాలలకు బ్రోచర్లు, ఎంట్రీ పత్రాలు పంపామని వారు తెలాపారు.
దేశంలో తెలుగు విద్యార్థులు ఎక్కడున్నా భద్రాద్రి బాలోత్సవంలో పాల్గొనేందుకు అర్హులేనని, వారికి ఇది చక్కటి వేదిక అవుతుందన్నారు. మొత్తం 27 అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఉండేందుకు 90శాతం మంది న్యాయనిర్ణేతలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నామని వారు పేర్కొన్నారు.

విద్యార్థులకు ఈ మూడు రోజుల పాటు స్థానికంగా భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామని, వారు ఉంటున్న వసతిగృహం నుంచి పోటీలు జరిగే ప్రాంతానికి విద్యార్థులు చేరుకునేందుకు బస్సులను నడుపుతామని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా ఏడాదిపాటు వారికి తీపి గుర్తులు మిగిలేలా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించామని, 27 అంశాల్లో 43 విభాగాలలో ఐదు వేదికలపై భద్రాద్రి బాలోత్సవం నిర్వహిస్తామన్నారు.

ఈ ఏడాది ఏకపాత్ర, మట్టితో ఆకృతులు, స్పెల్‌బీ, కథా విశే్లషణ, కవితా రచన అనే ఐదు అంశాల్లో కూడా పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థుల నుంచి ఎటువంటి ప్రవేశ రుసుం తీసుకోమని, ఎంట్రీలకు అక్టోబర్ 31వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు.

నర్సరీ నుంచి 4వ తరగతి వరకు సబ్‌నర్సరీ, 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు జూనియర్స్, 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. భద్రాద్రి బాలోత్సవంను విజయవంతం చేయాలని వారు కోరారు.

Related posts

0 comments:

Post a Comment