ABC Programme in TS Schools 2019-2020 (Attainment of Basic Competencies-ABC) under 3R's LEP Programme

Advertisement
Telangana School Education Department has started the ABC Programme in TS Schools 2019 for this academic year. In this connections detailed guidelines, Instructions and ABC Programme Action Plan have been issued to all the Educational Officers in Telangana State. ABC Programme is a 3R's LEP Programme i.e it is 3R's Remedial Teaching Programme for achieve minimum levels of learning in Telugu, English, Maths

ABC Programme in TS Schools

Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం) 
ప్రారంభ పరీక్ష (Baseline Test/ Pre Test): జూలై మాసం మొదటి వారం లో
అంత్య పరీక్ష (End line Test/ Post Test)  : ఆగష్టు చివరి వారం లో
*( ప్రారంభ పరీక్ష ప్రశ్నాపత్రాలను అందిస్తారు. )
ABC Programme Duration : కనీసం 45 రోజుల నుండి  గరిష్టంగా 60 రోజుల్లో


పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు
శ్రీ T . విజయ్ కుమార్, ఐ.ఎ.ఎస్., కమిషనర్ గారి ఉత్తర్వులు
ఉత్తర్వులు సంఖ్య:3117TSS/TSS /Pdg /T6/2019 | తేది:01.07.2019

విషయం: పాఠశాల విద్యాశాఖ, తెలగాణ రాష్ట్రం- 3, 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులకు కనీస సామర్థ్యాలను నేర్పడానికి "Attainment of Basic Competencies-(ABC)" (మూలాల్లోకి వెళదాం) కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించడం - కార్యాచరణ ప్రణాళిక గురించి

పై విషయం పురస్కరించడాని జిల్లా విద్యాధికారిల కు తెలియజేయునది ఏమనగా 2019-2020 విద్యాసంవత్సరం కోసం 'బడి బాట' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఉనికిని, గొప్పదనాన్ని సమాజం లోకి తీసుకెళ్ళి పిల్లల నమోదు పెంచడానికి కృషి చేసిన వారందరికీ అభినందన లు. నమోదు కార్యక్రమం అనంతరం పాఠశాలలో విద్యార్థుల అభ్యసనం మీద
ద్రుష్టి పెట్ట వలసిన అవసరం ఉంది.

బడి లో చేరిన పిల్లలందరూ వారు చదువుతున్న తరగతికి చెందిన సబ్జెక్టు వారి సామర్ధ్యాలను, అభ్యసన ఫలితాలను సారించాలి. ఇది పిల్లల సాయితో ముడిపడిన అంశం. పిల్లలు తాము చదవ బోతున్న తరగతిలో చేరడానికి అవసరమైన కనీస స్థాయిలను కలిగివున్నప్పుడే ఆ తరగతికి నినిర్దేశించిన తరగతివారీ సామర్థ్యాలను, అభ్యసనాఫలాలను సాధించగలుగుతారు.
తరగతి ఏదైనా, సబ్జెక్టు ఏదైనా బోధిస్తున్న ఉపాధ్యాయుడు బోధనాంతానికి చెందిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని పిల్లలందరూ కలిగివున్నారా? లేదా? అని పరిశీలించడం బోధనలో ప్రాథమిక అంశము. ఈ అవగాహన తోనే తాము ఎక్కడి నుండి బోధన ప్రారంభించాలి? బోధిస్తున్న విషయాన్ని పిల్లలకు ఎలా అందించాలి? అనే అంశాలు ముడిపడి ఉంటాయి. దీని ప్రాదాన్యతను అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడు తమ సబ్జెక్టుల్లో ఉన్నత ఫలితాలను సాధించి పిల్లలకు నాణ్యమైన విద్య నందించగలుగుతున్నారు.

ABC Programme Guidelines: Attainment of Basic Competencies

ఈ మధ్య కాలంలో పిల్లల స్థాయి గురించి జరిగిన వివిధ అధ్యయనం ఫలితాలు కొంత ఆలోచింపజేసేలా ఉన్నవి. జాతీయ స్థాయి సాధనాపరీక్ష (National Achievement Survey)-2017 ప్రకారం 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థుల భాష స్థాయి, గణితం లోని సాయి, ఆందోళన కలిగించేదిగా ఉంది. ప్రతీ సంవత్సరం ప్రధమ్  సంస్థ నిర్వహించే అధ్యయనాల్లో
కూడా ఫలిగాలు ఇదే విధంగా ఉన్నవి. చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయగలగడం వంటివి ప్రాథమిక తరగతులు పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు. వీటిని కలిగివున్న పిల్లలు ప్రాథమికోన్నత స్థాయి నుండి  వివిధ సబ్జెక్టులను నేర్చుకోవడంలో ముందుంటున్నారు. కాబట్టి 3 వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థులందరూ భాషలో, గణితం లో కనీస స్థాయిని కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైనదిగా భావించాలి. వీటిని సాధించడం ప్రాథమిక లక్ష్యం గా భావించి సారించాలి.


2019-20 విద్యా సంవత్సరం లో జూలై మొదటి వారం నుంచి 3 నుండి 7వ తరగతి విద్యార్తులందరూ మాతృభాష, గణితం, ఆంగ్ల భాష లో ఆయా తరగతుల్లో  కొనసాగడానికి అవసరమైన కనీస సామర్థ్యాలను సాధించే లా పాఠశాల వారీగా కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించుకొని అమలు పరచాలి, కనీసం 45 రోజుల నుండి  గరిష్టంగా 60 రోజుల్లోపల వీటిని సాధించాలి.

|ఇందుకోసం 2017-18 విద్యా సంవత్సరం లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు సంచాలకుల గిరి నుండి స్పష్టమైన ఉత్తర్వులను (ఉత్తర్వు సంఖ్య: 471/ర్. మ్. స్.ఏ /టీ. స్/2015, తేది : 14-07-2017) ఇచ్చి వున్నారు. కనీస సామర్ధ్యాల సాధన కోసం స్పష్టమైన కార్యాచరణ తో కూడిన ఉపాధ్యాయుల కరదీపికలు కూడా అందించారు. ధానోపాధ్యాయులందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు మాసం నుండి దీనిని అమలు పరిచి మంచి ఫలితాలను కూడా సాధించారు. అయితే, దీన్ని హర్తి స్థాయిలో అమలు పరిచిన ప్రతి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది  తమ పాఠశాలలో విద్యార్థులందరూ కనీస సామర్ధ్యాలు కలిగివున్నారని ఆత్మవిశ్వాసంతో ప్రకటించగలిగేలా 2019-2020 విద్యాసంవత్సరంలో నష్టమైన కార్యాచరణ  ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పరిశీలిద్దాం.

LEP 3R's Programme: Readiness Programme

కార్యాచరణ ప్రణాళిక
పాఠశాల స్థాయిలో చేపట్టాల్సిన వి
1. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, 22.వి.వి. పాఠశాలల్లో Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం కార్యక్రమాన్ని 2019 జూన్ మాసం నుండి అమలుచేయాలి.
2. 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరికీ తెలుగు/ మాతృభాష, ఆంగ్లం, గణితంలో కనీస సామర్గాలు సాధించేలా కార్యక్రమాన్ని  నిర్వహించాలి.
3. తెలుగు / మాతృభాషలో విద్యార్థులందరూ ధారాళంగా చదవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, తప్పుల్లేకుండా సొంతంగా చేయగలిగేలా చూడాలి
4. ఆంగ్లం లో కూడా విద్యార్డులందరూ ధారాళంగా చదవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, తప్పుల్లేకుండా సొంతంగా చేయగలిగేలా చూడాలి.
5. గణితంలో కూడికలు, తీసివేత, గుణకారం, భాగహారం లెక్కలు విద్యార్థులు చేయగలగాలి.
6. ఇందుకోసం జూలై మాసం మొదటి వారం లో విద్యార్థుల స్థాయిలను తెలుసుకోవడానికి ప్రారంభ పరీక్ష - తెలుగు, ఆంగ్లం, గణితంలో నిర్వహించాలి.( ప్రారంభ పరీక్ష ప్రశ్నాపత్రాలను అందిస్తారు. )
7. ప్రారంభ  పరీక్షధారంగా విద్యార్థులు తెలుగు / మాతృభాష గణితం, ఆంగ్లంలో కనీస సామర్ధ్యాలు కలిగినవారిని, లేనివారిని గుర్తించాలి. తరగరివారీగా విద్యార్థుల జాబితాను రూపొందించాలి.
8. సామర్ధ్యాల వారీగా పట్టికలో చేయగలిగితే (√), చేయలేకుంటే (X) తో గుర్తించాలి.
9. పై పట్టికలో ప్రారంభ పరీక్షా సమాచారాన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో CRP లు సేకరించి MIS సహకారంతో ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ఉన్నత స్థాయిలో ప్రధానోపాధ్యాయులు ప్రారంభ పరీక్ష ఫలితాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి.
10. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరగతి వారీగా విద్యార్థుల జాబితా ను పరిశీలించి ఉపాధ్యాయులు చర్చించాలి.
11. పాఠశాల వారీగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కలసి కనీస సామర్థ్యాలు లేని పిల్లలకు మూలాలను నేరుగా ఏ సమయంలో నేర్పాలి ? ఎవరెవరు ఏయే బాధ్యతలు స్వీకరించాలానే అంశాలను చర్చించి ప్రణాళికను రూపొందించుకోవాలి. దాని అమలు పరిచేలా ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలి.
12. 10/15 రోజులకు ఒక సారి కనీస సామర్ధ్యాల సాధన ను గురించి స్లిప్ టెస్ట్ లను నిర్వహించాలి. వీటి ఫలితాలను ప్రధానోపాధ్యాయుడు సమీక్షించాలి. తదుపరి లక్ష్యాలను నిర్ధారించాలి.
13. కనీస సామర్థ్యాలు లేని పిల్లలు మూలాలను నేర్పే సమయంలో మిగతా విద్యార్థులు నష్ట పోకుండా వారి స్థాయికి తగిన కర్యాలు / పనుల తో  పిల్లలు అభ్యసనం లో నిమగ్నం చేయాలి.
14. మూలాలను సర్చే సమయంలో పాఠశాలలో రెగ్యులర్ ససిలబస్ కు విఘాతం కలగకుండా పాఠశాల వారీగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక చేసుకోవాలి. అయితే, ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం లేదా సాయంత్రం ఒక పూట రెగ్యులర్ సబ్జెక్టు లను బోధించి మరొక పూట  మూలాలను నేర్పించాలి. పాఠశాలల్లో ఉపాధ్యాయులందరు గ్రూపులను
దత్తత తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించాలి.
15. వీటి గురించి అవగాహన కార్యక్రమాలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు స్కూల్ కాంప్లెక్స్లలో నిర్వహించాలి.
16. గణితం లో 4 ప్రక్రియలు రాని విద్యార్థులు 3, 2, 1 ప్రక్రియ రాని విద్యార్దులకు గ్రూపులుగా విభజింది సమవయస్కులను బోధన అభ్యాసకునిగా విభజించి సమ వయస్కుల బోధన అభ్యసన కు (Peer group learning ) ఎక్కువగా అవకాశం ఇచ్చి, ఎక్కువ అవసరమున్న పిల్లలకు ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా శ్రద్ధ తీసుకుని బోధించాలి.
17. 3, 4, 5 తరగతుల తెలుగు వాచకాల్లో  సంసిద్ధతా పాటలను చేర్చారు. వీటి ఆధారంగా పిల్లలకు చదవడం, రాయడం గురించి అభ్యాసం కల్పించి నేర్పించాలి,
18. వారంలో ఒకరోజు పిల్లలు ఏమేమి చేయగలుగుతున్నారో వారే గ్రహించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి.
19. పిల్లలు కించపరచడం, లేదా చేయగలిగినవారితో పోల్చడం ఎట్టి  పరిస్థితుల్లో చేయకూడదు. వారిని ప్రోత్సహించడానికి తరగతి వారీగా కనీస సామర్ధ్యాలు సాధించిన వారి పేర్లను తరగతి గోడ మీద లేదా నోటీసు బోర్డు మీద ప్రదర్శించాలి. వేగంగా నేర్చుకున్న వారిని అభినందించడానికి అసెంబ్లీ సమయంలో లేదా పాఠశాలలో జరిగిన సమావేశాలు సందర్భంగా చప్పట్లతో ప్రోత్సహించాలి. .
20. పిల్లలు కనీస సామర్థ్యాలను పాఠశాల సమయం అనంతరం నేర్పడానికి గ్రామాల్లోని విద్యాధికులు / స్వచ్చంద సంఘాల నాయకులు / చదువుకున్న  యువతీ యువకులు | పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు / ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి. పదవీ విరమణ చేసిన వారు (retired but not tired ) వయస్సు రీత్యా  ఉద్యోగ బాధ్యతలను తప్పుకోవచ్చు. కాని వారి లో సేవాభావాన్ని మనం వినియోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు ,
21. ఆగష్టు 31 తేదీ వరకు Attainment of Basic Competencies-ABC(మూలాల్లో కి వెళదాం) కార్యక్రమాన్ని అతి ముఖ్యమైనది గా భావించి తల్లిదండ్రుల సమావేశంలో అందరూ విద్యార్థులు చేయగలిగారని ప్రకటగలగలగాలి. అయితే 15 ఆగష్టు వరకు ఏ పాఠశాలల్లో నైతే  పూర్తిగా సాధించి, ప్రకటించగల్గుతారో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయికి ఆహ్వానించి పాఠశాలలకు అభినందన పత్రాలు అందజేస్తారు.

అభినందించడం/ప్రోత్సాహకాలు అందించడం
* కనీస సామర్గాలు అనగా చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు చేయగల్గిన పిల్లలను ఆ పాల ఉపాధ్యాయులను గుర్తించి అభినందించడం ద్వారా ప్రోత్సాహక వాతావరణాన్ని ఏర్పరచాలి. దీనికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. చప్పట్లు కొట్టించడం, వారి గురించి ప్రశంసించడం, దండలు వేయడం, దాతలు సహకారంతో ప్రోత్సాహకాలు అందించడం వంటివి చేయాలి.
ప్రతి బడి లో కనీస సామర్ధ్యాలు అనగా చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయ గల్గిన పిల్లలను గురించి పారశాల అసెంబ్లీ, ప్రజల యాజమాన్య కమిటీ సమావేశాల్లో వారిని, వారి తల్లిదండ్రులను చప్పట్లతో అభినందించాలి. దాత ల సహకారంతో ఆ పిల్లలకు నిఘంటువులు / కథల పుస్తకాలు/ సైకిళ్ళు వంటి వాటిని ఇవ్వడం ద్వారా ప్రోత్సహించాలి.
• కనీస సామర్ధ్యాలు సాధించిన విద్యార్థులు పేర్లు తరగతి వారీగా నోటీసు బోర్డు నందు రాసి ప్రదర్శించాలి.

బాల సాహిత్య వినియోగం
• పిల్లల్లో కనీస సామర్థ్యాలను పెంపొందించడానికి పుస్తక పఠనం అతి ముఖ్యమైనది. ఇందుకోసం పాఠశాలల్లోని గ్రంధాలయ | పుస్తకాలను, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు పిల్లలకు ఇచ్చి చదివించాలి.
• భోజన విరామ సమయంలో పిల్లల స్థాయి కి తగిన పుస్తకాలను ఇచ్చి చదివించాలి.

మానిటరింగ్ మరియు సమీక్షలు
* స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, తమ పరిధిలోని అన్ని పాఠశాలలను 15 రోజులకు ఒకసారి సందర్శించి పిల్లల అభ్యసనాన్ని పరిశీలించేలా మానిటరింగ్ కార్యక్రమాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడి రూపొందించాలి.
మండల విద్యాధికారికి కూడా పాఠశాలలను సందర్శించి పిల్లల ప్రగతి పరిశీలించాలి.
* జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి నాలుక మారు సమీక్షా సమావేశాన్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి. జిల్లా విద్యాధికారి కి కూడా నెలలో ఒకమారు ప్రతి మండలాన్ని సందర్శించి ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ప్రాథమికోన్నత / ఉన్నత పాఠశాల ను సందర్శించి పిల్లల స్థాయిలు పరిశీలించాలి.
* జిల్లా స్థాయిలో సమగ్ర జిల్లా అధికారులు, జిల్లా విద్యా సంస్థ ప్రధానాచార్యులు, ఉపన్యాసకులు, డిఇడి కళాశాలల ఉపన్యాసకుడు Attainment of Basic Competencies-ABC  (మూలాల్లో కి వెళదాం) కార్యక్రమం అమలు పరచడంలో, మానిటరింగ్ చేయడంలో జిల్లా విద్యాధికారి సహకరించాలి. జిల్లా విద్యాధికారి నేతృత్వంలో జిల్లా మానిటరింగ్ బృందాల ను ఏర్పరచాలి. వీరు ఒక నెలలో ప్రతి మండలాన్ని సందర్శించి కార్యక్రమం అమలు తీరుతెన్నులు గురించి జిల్లా విద్యారీరానికి నివేదిక సమర్పించాలి.
* జిల్లా సెక్టోరియల్స్ అధికారులు మండలాలు దత్తత తీసుకుని ఆయా మండలంలో జరిగిన ABC కార్యక్రమాలను పర్యవేక్షించాలి
* రాష్ట్ర స్థాయిలో ఎస్, సి.ఇ.ఆర్.టి,తో పాటు సమగ్ర జిల్లా అధికారులు దీంట్లో భాగస్వాములు కావాలి,
* ఆగష్టు చివరి వారం లో కనీస సామర్థ్యాల గురించి అంత్య పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి పాఠశాలలో విద్యార్థులందరూ కనీస సామర్ధ్యాలను సాధించగలిగేలా Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

ఈ సందర్భంలో తమరికి సమర్పించునది ఏమనగా 2019-20 విద్యాసంవత్సరంలో పిల్లలందరూ కనీస సామర్థ్యాలను పొంది ఆ యా తరగతుల చెందిన వివిధ సబ్జెక్టుల లోని అభ్యసనా సామర్థ్యాలను  సాధించేలా కృషి చేయాలి. పాఠశాలల వారీగా ప్రణాళికలు రూపొందించుకొని అమలు పరచాలి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కాంప్లెక్స్ పరిధి లోని పాఠశాలలకు
స్కూల్ కాంపై ప్రధానోపాధ్యాయుడు, మండలానికి మండల విధ్యాధికారి, జిల్లాకు జిల్లా విద్యాధికారి నేతృత్వం వహించి బాధ వహించి ఉంటుంది. Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదా) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి సత్ఫలితాలు సాధించాలి.
ఇందు మూలంగా పై విషయాలు తమరి పరిశీలనార్థం మరియు ABC కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికలను సూడనలకు సమస్త జిల్లా విద్యాధికారి తెలియజేయుటకు మరియు అమలు పరుచుటకు తమరి అనుమతి నిమిత్తం
సమర్పించనైనది

LEP 3Rs Programme Hand Books, Ebooks Download
ABC Programme in TS Schools - LEP 3Rs Programme

For more details please visit the above mentioned Official Website. If you like this post please share on Social Groups, as it will be help them. Thanks...
Advertisement
SHARE THIS

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top