I love my Job Essay Writing Competitions: State Level, District Level Toppers List 2019 (I Love my Job Winners List)

I love my Job Essay Writing Competitions: State Level, District Level Toppers List 2019: Telangana School Education Department has conducted the essay writing competition at the school Level for all the teachers on the topic, "I love my job" in the second week of July month in TS Schools. The Language-wise District toppers' and Sate Level toppers are finalized and I Love my Job Winners list has been released on July 17, 2019. The district level toppers will be felicitated at the district level on July 18 to 19, 2019.  The state level toppers as well as the district level toppers (first only) in the Essay Writing Competition to be felicitated at ASCI, Khairatabad, Hyderabad at 12:00 - 1:00 PM on 20-07-2019. Language wise List of State Level Selected Teachers in the Essay writing Competition and  Language wise District wise list of Toppers in the Essay Writing Competition file provided for you.

I love my Job Essay Writing Competitions: State Level, District Level Toppers List 2019 (I Love my Job Winners List)


పాఠశాల విద్యలో వినూత్న కార్యక్రమం: ‘ఐ లవ్‌ మై జాబ్‌’. ఆచరణతోపాటు వ్యాసరచన పోటీల నిర్వహణ. ఉత్తమ వ్యాసాలు రాసిన 107 మందికి 20న సన్మానం. పాఠశాల విద్యలో వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల్లో తాము చేస్తున్న వృత్తి పట్ల అంకితభావం పెంపొందిం చేందుకు ‘ఐ లవ్‌ మై జాబ్‌’, ‘యాక్ట్‌ నౌ’వంటి కార్యక్రమాలను చేపట్టింది.విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఆలోచన మేరకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యా కార్యాలయాల్లో ‘ఐ లవ్‌ మై జాబ్, యాక్ట్‌ నౌ’ల బోర్డును ఏర్పాటు చేసింది. తద్వారా అధికారులు, సిబ్బందిలో వృత్తి పట్ల అంకిత భావం పెంపొందించవచ్చన్నది ఉద్దేశం.అంతేకాదు ‘ఐ లవ్‌ మై జాబ్‌’అంశంపై ఉపాధ్యాయులు, అధికారులకు వ్యాస రచన పోటీలు నిర్వహించింది.

పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. అందులో జిల్లా స్థాయిలో ఉత్తమ వ్యాసాలు రాసిన ఉపాధ్యాయులను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఉత్తమంగా నిలిచిన వ్యాసాలు రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయికి వచ్చిన వ్యాసాల్లో ప్రతి భాషలో మూడు (ప్రథమ, ద్వితీయ, తృతీయ) వ్యాసాలను ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు.. వాటిని రాసిన ఉపాధ్యాయులతోపాటు, జిల్లా స్థాయిలో ఆయా భాషల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 107 మందిని ఈనెల 20న సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొననున్నారు.

I Love my Job Winners list 
PROCEEDINGS OF THE COMMISSIONER, SCHOOL EDUCATION
DEPARTMENT, TELANGANA, HYDERABAD
Rc.No: 134/C&T/SCERT/TS/2019; Dated: 17-07-2019

Subject: SCERT, Telangana, Hyderabad - Essay writing competition on "I love my job on 08-07-2019 for teachers in Districts - Felicitation to toppers at the District Level and State Level - Reg
Ref: 1) Proceedings no even, dated : 11-06-2019, 19-06-2019

An essay writing competition was conducted at the school Level for all the teachers on the topic, "I love my job" in the second week of this month. School-wise, Mandal-wise and District level toppers are selected in 4 languages i.e., Telugu, English, Hindi and Urdu at the rate of 3 in each language from each district are sent to the state level competition. Among them, language-wise toppers' are finalized

The District Educational Officers are instructed to felicitate the district level toppers on at the district level on July 18 to 19, 2019 duly involving the teachers community, parents and other people connected education on a grand scale.

The district level toppers like First, Second and Third in Telugu, English, Hindi and Urdu are finalized by the experts at the state level. They are going to be felicitated at ASCI, Khairatabad, Hyderabad at 12:00 - 1:00 PM on 20-07-2019 by the Hon'ble Education Minister and the Secretary, Department of School Education, Govt. of Telangana

Hence, the concerned District Educational Officers are instructed to depute the state level toppers as well as the district level toppers (first only) in the Essay Writing Competition, "I Love My Job as per the list enclosed herewith, with instructions to report to Smt. Tahseen Sultana, Prof., C&T, SCERT at Godavari Auditorium, SCERT Campus, Opp: L B Stadium, Hyderabad by sharp 10.00 A.M.

I love my Job Essay Writing Competitions State Level, District Level Toppers List 2019: Language wise List of State Level Selected Teachers in the Essay writing Competition and Language wise District wise list of Toppers in the Essay Writing Competition

‘వృత్తిని ప్రేమించే’ ఉపాధ్యాయులకు సన్మానం: ‘నేను నా వృత్తిని ప్రేమిస్తాను’ అనే ఇతివృత్తంతో జూన్‌లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథములుగా నిలిచిన ఉపాధ్యాయులను సన్మానించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రథములుగా నిలిచిన వారితోపాటు రాష్ట్ర స్థాయిలో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల్లో రాసి రాష్ట్ర స్థాయిలో మొదటి  మూడు స్థానాలను గెలిచిన ఉపాధ్యాయులు 107 మందిని సన్మానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 20వతేదీన  ఆస్కీ సమావేశ మందిరంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వారిని సన్మానిస్తారని పేర్కొన్నారు.
State Level, District Level Toppers List in the Essay writing Competition

About: I love my Teachers Job
ఉపాధ్యాయుల్లో ప్రేరణ నింపే...సరికొత్త ప్రయోగం
తరగతి గది కుటుంబమైతే... దానికి యజమాని ఉపాధ్యాయుడే. కుటుంబ సభ్యుల ఉన్నతిని యజమాని ఎంతగా కోరుకుంటాడో.. విద్యార్థుల అభ్యున్నతిని కూడా ఉపాధ్యాయుడు కూడా అలాగే ఆకాంక్షించాలి. అప్పుడే విద్య ఏకై క లక్ష్యం నెరవేరుతుంది. మన జాతీయ విద్యావిధానం కూడా ఇదే చెబుతోంది. విద్య లక్ష్యం నెరవేరడంలో ఉపాధ్యాయుడి పాత్రే ప్రధానమంటోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణ విద్యాశాఖ ఓ వినూత్న ఆలోచన చేస్తోంది.
.
ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారుల ముందు.. వారి హోదాను తెలియజేసే టేబుల్ బోర్డులు కనిపిస్తాయి. సరిగ్గా అలాంటివే ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కనిపించబోతున్నాయి. అయితే వాటిపై ఉపాధ్యాయుడి హోదా ఉండదు. దానికి బదులుగా.. ‘నేను నా వృత్తిని ప్రేమిస్తున్నాను’ అని రాసి ఉంటుంది.

ఉపాధ్యాయుల్లో ప్రేరణ: వృత్తిపట్ల గౌరవం, విధుల నిర్వహణలో బాధ్యతను ఉపాధ్యాయులకు అనుక్షణం గుర్తుచేసేందుకే విద్యాశాఖ ఈ ఆలోచన చేస్తోంది. ఉపాధ్యాయుల్లో ప్రేరణ నింపేందుకే దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)కి ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు.

కేవలం పాఠశాలలకే పరిమితం కాదు: కేవలం పాఠశాలలకే ఈ ఆలోచనను పరిమితం చేయాలనుకోవడం లేదు. మండల వనరుల కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది దాక అందరూ తాము పని చేస్తున్న స్థలంలో వారి టేబుల్‌పై ‘నేను నా వృత్తిని.. చేస్తున్న పనిని ప్రేమిస్తున్నాను’ అని పెద్దగా రాసి ప్రదర్శించాల’ని విద్యాశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఆయా సంస్థల అధిపతులు దీని ప్రాధాన్యాన్ని సిబ్బందికి వివరించి అవగాహన కల్పించాలని కూడా పేర్కొంది.

ఉపాధ్యాయులకు వ్యాసరచన పోటీలు: ఉపాధ్యాయులకు ‘నేను నా వృత్తిని ప్రేమిస్తున్నాను’ అనే నినాదంపై తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. అందులో నుంచి ఉత్తమమైన ఒక దానిని ప్రధానోపాధ్యాయుడు ఎంపిక చేస్తారు. ఆ వ్యాసాన్ని పాఠశాల అసెంబ్లీ సమావేశంలో, ప్రతి తరగతి గదిలో చదివి వినిపిస్తారు. ఎంపికై న వ్యాసాన్ని ఎంఈఓ కార్యాలయానికి పంపిస్తారు. మండలంలోని అన్ని పాఠశాలల నుంచి అందిన వ్యాసాల్లో ఒక్కొక్క భాషకు ఒకటి చొప్పున ఎంఈవో ఎంపిక చేసి డీఈవోకు పంపించాలి. వీటిలో ఉత్తమమైన వ్యాసాలను డీఈవో ఎంపిక చేసి హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీకి పంపించాలి. చివరకు ఈ వ్యాసాలను ఓ పుస్తక రూపంలోకి తీసుకురావడానికి ఎస్‌సీఈఆర్‌టీకి పంపుతారు.

Related posts

0 comments:

Post a Comment