State Level Drama Competitions to TS Schools Children 2019 by Telangana Sangeetha Nataka Academy, TSNA

State Level Drama Competitions to TS Schools Children 2019: Telangana Sangeetha Nataka Academy, TSNA would like to Conduct State Level Drama competitions to the School Children from VIII class to X class belongs to Government and Recognized Private Schools and all the Residential Schools throughout the Telangana State. The Competitions will be conducted in Ravindra Bharathi from 24.09.2019 to 26092019 The main aim of this Competition is to develop the art of drama from the School level and encourage the children in this regard

State Level Drama Competitions to TS Schools Children 2019 by Telangana Sangeetha Nataka Academy, TSNA

Telangana Sangeetha Nataka Academy, TSNA has requested to enable the school children to participate in the drama competitions. The Schedule of the Programme, Rules and Regulations are provided here.

So, Telangana Sangeetha Nataka Academy is going to organise DRAMA Competitions for the students of VIll to X, from 24-09-2019 to 26-09-2019 in Ravindra Bharathi, Hyderabad. The 1st winner group will get cash prize for Rs 25,000/-,  2nd Prize for Rs 20,000/- and 3rd Prize for Rs 15,000/-. All schools Principals and Head Masters to motivate the students and make them to participate in DRAMA competitions

Competitions in StudentsCompetitions 



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ సంగీత నాటక అకాడమీ
సర్క్యులర్

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి 26వ తేది వరకు మూడు రోజులపాటు ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నాటిక పోటీలు రవీంద్రభారతిలో నిర్వహించబడతాయి. స్క్రూటినీ ఆగస్టు నుంచి మొదలౌతుంది. ఆసక్తి గల పాఠశాలలు  క్రింది అంశాల మేరకు నాటిక వివరాలు పొందు పరుస్తూ దరఖాస్తులను బాద్మి శివకుమార్ చైర్మన్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్-4 చిరునామాకు వ్యక్తిగతంగా కాని, పోస్ట్ ద్వారా కాని, ఇ-మెయిల్ - tsna.hyd@yahoo.com. ద్వారా గాని సమర్పించాల్సి ఉంటుంది.

1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు గురుకుల పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి.
2. ఒక పాఠశాల నుండి ఒక నాటికకు మాత్రమే అవకాశం ఉంటుంది.
3. ప్రదర్శన నిడివి 300 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉండాలి.
4. ఇతివృత్తాలు ఏవైనా ప్రదర్శించవచ్చు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం  మరియు కుల, మత వర్గాల వారి మనోభావాలను కించపరిచే ఇ తివృత్తాలై ఉండకూడదు.
5. తేదీ జూలై 20వ తేదీ లోపు పోటీలలో పాల్గొనే వారు అంగీకారం  తెలుపుతూ ప్రాథమిక సమాచారంతో ఆడాడమీలో రిజిస్ట్రేషన్ చేసుకోవలిసి ఉంటుంది.
6, పోటీ లో పాల్గొన దలచిన వారు ఆగష్టు 15 వ లోపు పూర్తి స్థాయి సమాచారంతో తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి
7. ప్రదర్శన కు మైక్, లైటింగ్, సాధారణ పరదాలు మాత్రమే ఏర్పాటు చేయబడతాయి.
8. నాటక ప్రదర్శన రోజు భోజనం ఏర్పాటు చేయబడుతుంది,
9. పోటీలో పాల్గొనుట కు ఎన్ని నాటకాలు సెలక్ట్ చేయాలో కమిటీ యే నిర్ణయిస్తుంది,
10. జిల్లా స్క్రూటినీ ద్వారా నిర్ణయించబడ్డ నాటికలు మాత్రమే ప్రదర్శనకు అనుమతించబడతాయి.

11. పోటీల్లో గెలిచిన బృందాలకు 
మొదటి బహుమతి - 25,000/-, 
రెండవ బహుమతి - 20,000/-, 
మూడవ బహుమతి = 15,000/- మరియు 
ఐదు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున ఇవ్వబడుతాయి.

12 ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఐదు నాటికలకు జ్యూరీ అవార్డులు ఉత్తమ నటుడు / నటి, ఉత్తమ హాస్య నటుడు / నటి, ఉత్తమ సహాయ నటుడు / నటి, ఉత్తను ప్రతినాయకుడు/ప్రతి నాయక, ఉత్తమ మేకప్, ఉత్తమ సెట్ డిజైన్, ఉత్తమ లైటింగ్, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచనలకు కూడా బహుమతులు ఒక్కొక్కరికి రూ. 1116/-లు ఇవ్వబడును.
13. ప్రదర్శన లో పాల్గొన్న ఎన్ని బృందాల వారికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ సర్టిఫికేట్లు ఇవ్వబడుతాయి,
| 14 పాల్గొన్న ప్రతి వాటిక కు రూ 8,000/- (ఐదు వేల రెమ్యూనరేషన్ మరియు బస్సు ప్రయాణ ఖర్చులు ప్వబడును)

Related posts

0 comments:

Post a Comment