ABC Programme in September: "Month of Quality Achievement" in TS Schools 2019 under Attainment of Basic Competencies Program

ABC Programme: "Month of Quality Achievement" in September in TS Schools 2019: School Education Department,  SCERT, Telangana has decided to celebrate September 2019 as "Month of Quality Achievement" (Saamarthyala Saadhana Maasotsvam).  In this connection, Certain instructions and guidelines have been given for Celebrating September 2019 as "Month of Quality Achievement" (Saomarthyola Soadhana Maasotsvam)

ABC Programme in September: "Month of Quality Achievement" in TS Schools 2019 under Attainment of Basic Competencies Program

ABC Programme i.e Attainment of Basic Competencies Program has been introduced in TS Schools from July month for Class 3rd to 8th. Detailed guidelines have been issued on implementation of Attainment of Basic Competencies - ABC (Moolalloki Veladam] Programme effectively for the children of classes 3rd to 8th in all the Government & Aided Schools in the Telangana State. Baseline Test papers have been prepared to assess the basic competencies of children in Reading, Writing  (For Telugu, English) and four fundamental Mathematical operations.

ABC Programme in September
a. What is ABC Programme: 1. Attainment of Basic Competencies would be conducted in TS Schools.
 2. Learning Enhancement Programme in TS Schools.
 3. Basic Competencies Improvement Programme in TS Schools.
 4. Improve the basic competencies of reading, writing and arithmetic
So, Improving the basic competencies in reading, writing and arithmetic for all students in primary, Upper Primary and High Schools.
3Rs Remedial Teaching Programme would be conducted in every year in TS Schools
. ABC Programme Meaning in Telugu: Moolalloki Veladam or Saamarthyala Saadhana Karyakramamu
c. ABC Programme Pre Test was held: in July 1st week
d. ABC Programme Post Test was held: in August last week
c. ABC Programme Duration: కనీసం 45 రోజుల నుండి  గరిష్టంగా 60 రోజుల్లో
d.  Saamarthyala Saadhana Karyakramamu ABC Program would be conducted in the month of September 2019
e. Badi Bata Programme In the month of June 2019
d. I Love my Job In the month of July 2019
Enter the number of girls who attended No.of Girls Attended


పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు
ఉత్తర్వులు సంఖ్య: 100 C&T/SCERT/TS/2019 Dt: 28-08-2019
విషయం : పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్రం - సెప్టెంబర్, 2019 మాసం నుండి "సామర్ధ్యాల సాధన కార్యక్రమం"గా నిర్వహణ – మార్గదర్శకాలు పంపడం గురించి.

సందర్భం : పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారి నేతృత్వంలో జరిగిన పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశం
తీర్మానాలు, తేది: 14.08.2015,

పై విషయం పురస్కరించుకొని ప్రాంతీయ సంచాలకులు పాఠశాల విద్య, జిల్లా విద్యాశాఖాధికారి కు తెలియజేయునది ఏమనగా, బడి ఈడు పిల్లలందరు బళ్ళ లో చేరాలి, వారందరూ నాణ్యమైన విద్యను పొందాలి. నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం - 2009 కూడా విద్యార్థులందరూ నాణ్యమైన విద్యను పొందాలని పేర్కొంది. ఇందుకనుగుణంగా చట్ట సవరణ కూడా జరిగింది. దీని ప్రకారం తరగతుల వారీగా విద్యార్థులందరూ ఆయా సబ్జెక్టులు సంబంధించిన సామర్థ్యాలకనుగుణంగా అభ్యసన ఫలితాలు సాధించాల్సిన ఉంటుంది.

2019-2020 విద్యా సంవత్సరం లో 
a. జూన్ మాసంలో బడి బాట కార్యక్రమం ద్వారా బడిఈడు పిల్లలను బళ్ళలో చేర్చాము, 
b. జూలై మాసంలో విద్యాశాఖ లోని వారందరూ మన వృత్తి చేస్తున్న పనికి పునరంకిత మై స్వీయ ప్రేరణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన సత్ఫలితాలను సాధించడానికి నేను నా వృత్తి ప్రేమిస్తున్నాను" అని ప్రకటించుకుని పాఠశాల స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించుకున్నాం.
c. ఆగస్టు - 2019: వాణ్యమైన విద్య విద్యార్థుల హాజరు ముడిపడిన అంశం. బడికి సక్రమంగా ప్రతీ రోజూ హాజరై తేనె చదువుల్లో కూడా ముందుంటారని భావించి 'ఆగస్టు - 2019 మాసాన్ని హాజరు మాసోత్సవం'గా ప్రకటించి విజయవంతంగా అమలు చేస్తున్నాం. సమాజ భాగస్వామ్యంతో పిల్లలు హాజరు పెంచగలిగాం. అత్యధిక హాజరు శాతం కలిగిన విద్యార్థులను ప్రోత్సహిన్నాం.
d. 'బాలల సంఘాలు: విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారికి పాఠశాల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి 'బాలల సంఘాలు ఏర్పాటు చేశాం.
e. ABC Programme: అలాగే విద్యార్థులందరూ కనీస సామర్థ్యాలను కలిగి ఉన్నప్పుడు ఆయా తరగతులకు చెందిన అభ్యసనా ఫలితాలు సాధించగలరని భావించి 'మూలాల్లోకి వెళదాం' (Attainment of Basic Competencies. ABC) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.


 ABC Program Grading Pre Tet and Post Test
 ABC Program Guidelines  ABC Program in Telugu
 45 Days Action Plan for Primary Schools LEP - 3Rs - ABC
 45 Days Action Plan for High SchoolsLEP - 3Rs - ABC
 ABC - LEP - 3Rs Module ABC Module
 ABC - LEP - 3Rs Material Hand Books - Work Sheets
 ABC Program Info ABC Progamme
 ABC Question Papers  ABC Test Papers
 ABC Program:
 45 Days Programme
 Day wise Activities,
 Subject wise Action plan
 45 Days Action Plan

సెప్టెంబర్ మాసం - సామర్ధ్యాల సాధన కార్యక్రమం
సెప్టెంబర్ మాసం నుండి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుండి 9వ తరగతి వరకు విద్యార్థులందరూ తరగతి వారీగా సామర్ధ్యాలకు అనుగుణంగా అభ్యసనా ఫలితాలు సాధించడానికి నాణ్యత మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సెప్టెంబర్ మాసం నుండి సామర్థ్యాల సాధన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి విద్యార్థులందరూ నాణ్యతను సాధించేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి అందరూ కృషిచేయాలని కోరవైనది.

గమనిక: సెప్టెంబర్ 2019 నుండి “సామర్ధ్యాలు సాధన కార్యక్రమం గా నిర్వహణ మార్గదర్శకాలు జతచేయనైనది.

‘సెప్టెంబరు మాసం నుండి సామర్థ్యాల సాధన కార్యక్రమం'మార్గదర్శకాలు:
I. నాణ్యమైన విద్య : అనగా... విద్యార్థులందరూ వారుచదువుతున్న తరగతికి చెందిన వివిధ సబ్జక్టులలోని సామర్ధ్యాలకుఅనుగుణంగా'అభ్యసనాఫలితాలను సాధించడం, సెప్టెంబరు - 2019 నుండి సామర్ధ్యాల సాధన కార్యక్రమాన్నినిర్వహించాలి,
II. ఎవరికి నిర్వహించాలి? 11 నుండి 5వ తరగతి వరకు విద్యార్థులందరికీ నిర్వహించాలి.
III. ఎప్పటి నుండి ఇప్పటి వరకు ! 2019 సెప్టెంబరు మాసం నుండి 2020 మార్చి మాసాంతం వరకు నిర్వహించాలి,
IV సాధించాల్సిన లక్ష్యం : 9వ తరగతి వరకు విద్యార్థులందరూ సబ్జక్టువారీగా అభ్యసనాఫలితాలను సాధించాలి.

సామర్థ్యాల సాధన కార్యక్రమం - నిర్వహణావిధానం
అ) పాఠశాల స్థాయి
1) ఉపాధ్యాయులందరూ వారు బోధిస్తున్న సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాలను బోధించాలి
2) ఆ subject లకు చెందిన సామర్థ్యాలకనుగుణంగా ప్రతీ పాఠం ద్వారా సాధించాల్సిన అభ్యసన ఫలితాల జాబితాను సిద్ధం చేసుకోవాలి
3) వీటి సాధన కోసం సరైన బోధనా వ్యూహాలను, బోధనాభ్యసన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి
4) విద్యార్థులందరూ పాల్గొనేలా చర్చలు, ప్రయోగాలు, అటుపనులు, ప్రదర్శనలు, కృత్యాలు మొదలగువారీ ద్వారా బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి
5) పాఠశాలలోని ప్రయోగశాలలను పూర్తిగా వినియోగించాలి. పాఠ్యాంశాల కనుగుణంగా విద్యార్థులకు ప్రయోగాలను నిర్వహించి అవగాహన కల్పించాలి
6) పాఠశాలలోని గ్రంథాలయాలను సద్వినియోగపరచుకోవాలి. విద్యార్థులతో గ్రంథాలయ పుస్తకాలను చదవించడం ద్వారా భాషాసామర్థ్యాలు వృద్ధిచెందుతాయి. డిజిటల్ క్లాసులను, సాంకేతిక వనరులను బోధనాభ్యసన ప్రక్రియల్లో సందర్భోచితంగా వినియోగించాలి.
7) ఆ పాఠ్యాంశానికి చెందిన అభ్యసనాఫలితాలకు అనుగుణంగా ప్రశ్నలు రూపొందించుకోవాలి.
8) పాఠ్యాంశ బోధన అనంతరం అభ్యసనాఫలితాల ఆధారంగా రూపొందించిన ప్రశ్నలతో లఘు పరీక్షను నిర్వహించుకోవాలి
9)  విద్యార్థులు ఏయే అంశాల్లో బాగా చేయగలిగారు, ఏవేవి చేయలేకపోయినారో గుర్తించి ప్రత్యామ్నాయ బోధనను నిర్వహించాలి
10) మాసవారీగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ప్రగతి గురించి సమీక్షించాలి, ఆ మాసంలో బోధించిన పాఠ్యాంశాలకు చెందిన అభ్యసనాఘతాలను ఎంతమంది విద్యార్థులు సాధించగలుగుడుస్పోరో తెలుసుకోవాలి
11) మాసవారీగా పాఠశాలలో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశాల్లో విద్యార్థుల ప్రగతిని తెలిపే ప్రదర్శనలను నిర్వహించాలి.
12) ఆలాగే సామర్ధ్యాల సాధనలో ముందున్న ఉపాధ్యాయులను అభినందించాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి. ఇందుకోసం స్థానిక సమాజ సహకారంతో ప్రోత్సాహకాలను అందజేయాలి
13) తరగతివారీగా విద్యార్థుల ప్రగతి వివరాలను నమోదు చేయాలి. వాటిని ప్రదర్శించాలి.

ఆ) స్కూల్ కాంప్లెక్స్ స్థాయి
1) సెప్టెంబరు - 2019 మాసం మంది నిర్వహించబోయే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను 'సామర్థ్యాలసాధన' కార్యక్రమానికి అనుగుణంగా నిర్వహించాలి.
2) ప్రతి స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో తదుపరి మాసంలో బోధించే పాఠాలను గుర్తింపజేయాలి.
3) ఆయా పాఠ్యాంశాలకు చెందిన అభ్యసనాఫలితాల జాబితాను తయారుచేయించాలి.
4) వీటిని సాధించడానికి ఉపాధ్యాయులతో బోధనావ్యూహాలను రూపొందింపజేయాలి,
5) విద్యార్థులతో ప్రదర్శనాపాఠాలను (డెమానిస్ట్రేషన్స్ లెసన్స్) నిర్వహించాలి.
6) అభ్యసనాఫలితాలకు అనుగుటంగా మూల్యాంకనం చేయడానికి ప్రశ్నలను రూపొందింపజేయాలి.
7) పాఠశాలల వారీగా అభ్యసనాఫలితాల సాధన గురించి సమీక్ష నిర్వహించాలి.
8) సందేహాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమిష్టిగా వీటికి నివారణలను చర్చల ద్వారా పొందాలి.
9) స్కూల్ కాంపెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా ఎంత శాతం మంది పిల్లలు సజ్జకు వారీగా అభ్యసనా,ఫలితాలను సాధించారో వివరాలను ప్రదర్శించాలి.

ఆ) మండల స్థాయి
1) మండల విద్యాశాఖాధికారి మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అవగాహనను కల్పించాలి
2) మండల స్థాయిలో మానిటరింగ్ బృందాన్నీ ఏర్పరచుకొని మానిటరింగ్ చేయాలి.
3) మాసానికొకసారి ప్రధానోపాధ్యాయులతో సమీక్షాసమావేశాన్ని నిర్వహించాలి.
4) అభ్యసనాఫలితాల సాధనలో మంచి ప్రగతి కనబరుస్తున్న ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను గుర్తించి వారిని అభినందించాలి

ఈ) జిల్లా స్థాయి
1) జిల్లా విద్యాశాఖాధికారి గారు జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, సభిక్షువారీగా జిల్లా రీసోర్సు బృందాలకు కార్యక్రమంపట్ల అవగాహన కల్పించాలి
2) సామర్థ్యాల సాధన గురించి జిల్లా స్థాయి మానిటరింగ్ బృందాలను ఏర్పరచాలి.
3) మాసవారీగా మండల విద్యాశాఖాధిడారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి.
4) మాసవారీగా సామర్ధ్యాల సాధన కార్యక్రమం అమలుతీరును, ఫలితాలను, విశిష్టంగా కృషిచేస్తున్న ఉపాధ్యాయుల గురించి నివేదికలను, వీడియోలు / ఫోటోలను జిల్లా వెబ్ సైట్లో పెట్టాలి, వీటిని పాఠశాల విద్య రాష్ట్ర స్థాయి వెబ్ సైట్లో కూడా అప్లోడ్ చేయాలి.

ఉ) రాష్ట్ర స్థాయి:
1) సామర్థ్యాల సాధన కార్యక్రమం గురించి పాఠశాల విద్యాశాఖ అధికారులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు అందరికీ TSAT ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించాలి.
2) ఉపాధ్యాయులకు సామర్ధ్యాల సాధన, అభ్యసనా ఫలితాల గురించి శిక్షణా కార్యక్రమాన్ని DIETల ద్వారా నిర్వహించాలి.
3) కార్యక్రమ అమలుతీరు గురించి, విద్యార్థుల ప్రగతి గురించి రాష్ట్ర స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారులతో సమీక్షాసమావేశాన్ని నిర్వహించాలి.

ఊ) మూల్యాంకన కార్యక్రమం :
1) పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాల వారీగా అభ్యసనాఫలితాలకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నలతో విద్యార్థుల స్థాయిని అంచనావేయాలి.
2) నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా నిర్వహించే లఘుపరీక్ష (స్లిప్ టెస్ట్)ను కూడా అభ్యసనాఫలితాల ఆధారంగానే నిర్వహించాలి.
3) లఘుపరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రత్యామ్నాయ బోధనను చేపట్టాలి.
4) మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యార్థుల ప్రగతిని విశ్లేషించాలి. ఏయే సామర్థ్యాలకు చెందిన అభ్యసనాఫలితాలను విద్యార్థులు చేయలేకపోయాడో గుర్తించి పునరభ్యాసాన్ని కల్పించాలి
5) 2017-18 విద్యాసంవత్సరంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాధనాపరీక్ష (నేషనల్ ఎచీవ్ మెంట్సర్వే ఫలితాల ఆధారంగా ఆయా జిల్లాలోని ఫలితాలను విశ్లేషించుకొని జిల్లా విద్యాధికారులు తగిన చర్యలు చేపట్టాలి.
6) జాతీయ స్థాయి నుండి ఈ విద్యా సంవత్సరం పాఠశాల ఆధారిత మూల్యాంకనం (school based assessment) నిర్వహిస్తారు. ఇది కూడా అభ్యసనాఫలితాల ఆధారంగానే ఉంటుంది. కాబట్టి, పాఠ్యాంశాల వారీగా గుర్తించిన అభ్యసనాఫలితాలను సాధించేలా మూల్యాంకనాన్ని, వాటి ఫలితాలను వినియోగించుకోవాలి, వీటి ఆధారంగా తగిన చర్యలను పాఠశాలలో చేపట్టాలి.

ఎ) మానిటరింగ్ కార్యక్రమం :
1) పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుడు సామర్ధ్యాల సాధన గురించి మానిటరింగ్ చేయాలి. 15 రోజులకొకసారి ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి ప్రగతి చోటుచేసుకొనేలా చర్యలు చేపట్టాలి.
2) స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు తన పరిధిలోని అన్ని పాఠశాలలను మాసంలో ఒకసారి మానిటరింగ్ చేయాలి.
3) మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, మరొక సీనియర్ ప్రధానోపాధ్యాయుడితో మానిటరింగ్ బృందాన్ని ఏర్పాటుచేయాలి. వీరు మండలంలోని అన్ని పాఠశాలలను మాసంలో ఒకసారి సందర్శించి మానిటరింగ్ చేయాలి.
4) దీని ఆధారంగా మండల స్థాయిలో నిర్వహించే ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో మండల విద్యాశాఖాధికారి చర్చించాలి
5) జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి జిల్లాలోని సెక్టోరల్ అధికారులు, జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఉపన్యాసకులతో, ప్రధానోపాధ్యాయులతో మానిటరింగ్ బృందాలను ఏర్పరచాలి. అనగా... జిల్లాలోని మొత్తం మండలాలను 4 భాగాలుగా విభజించాలి. ఇందుకోసం 4 మానిటరింగ్ బృందాలను సెక్టోరల్ అధికారుల నేతృత్వంలో ఏర్పరచాలి.
ప్రతి బృందంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులను సభ్యులుగా పెట్టాలి. వీరు తమకు కేటాయించిన మండలాలను మాసంలో ఒకసారి సందర్శించి మానిటరింగ్ చేయాలి. ఒక మండలంలో తప్పనిసరిగా ఒక ఉన్నత పాఠశాలను, ఒక కె, జి. వి.మీ. పాఠశాలను,రెండు ప్రాథమిక పాఠశాలలను సందర్శించాలి
6) ఒక్కొక్క మానిటరింగ్ బృందం మండలం వారీగా నివేదికను రూపొందించి జిల్లా విద్యాశాఖాధికారికి సమర్పించాలి
7) మండల విద్యాశాఖాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో మాసవారీగా నిర్వహించే సమీక్షాసమావేశంలో జిల్లా విద్యాధికారి మానిటరింగ్ బృందాల నివేదికల ఆధారంగా చర్చించాలి.
8) రాష్ట్రస్థాయి నుండి ఎస్.సి.ఇ.ఆర్.టి., సమగ్ర శిక్ష అధికారులతో రాష్ట్రస్థాయి మానిటరింగ్ బృందాలను ఏర్పరచాలి. వీరు మాసానికొకసారి వారికి కేటాయించిన జిల్లాలను సందర్శించి సామర్థ్యాల సాధన కార్యక్రమం గురించి మానిటరింగ్ చేయాలి జిల్లాల వారీగా నివేదికలను పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారికి సమర్పించాలి.

ABC Programme in September: "Month of Quality Achievement" in TS Schools 2019

పైన తెల్పిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు సెప్టెంబర్ మాసం నుండి అన్ని పాఠశాలల్లో పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడం కోసం “సామర్థ్యాల సాధన కార్యక్రమం"ను అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి నిర్వహించాలని కోరడమైనది.

0 comments:

Post a Comment